ETV Bharat / state

2వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం... ముగ్గురు అరెస్ట్​

పశ్చిమగోదావరి జిల్లా బుచ్చియ్యపాలెంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 60 లీటర్ల నాటుసారా స్వాధినం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బుచ్చియ్యపాలెం నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు

author img

By

Published : May 6, 2020, 8:08 PM IST

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బుచ్చియ్యపాలెంలో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్​ సీఐ సత్యనారాయణ తెలిపారు. సారా కాస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారినుంచి ద్విచక్ర వాహనంతో పాటు 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

మద్యం ధరలు భారీగా పెరగడం వల్ల మందుబాబులు నాటుసారాకు అలవాటుపడుతున్నారని సీఐ అన్నారు. ఈ నేపథ్యంలో సారా తయారీ కేంద్రాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పోలవరం సర్కిల్ పరిధిలో సారా నియంత్రణ కోసం కృషి చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ద్విచక్రవానంపై నాటుసారా అక్రమ రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.