చౌకధర డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఇంటికే రేషన్ సరకులు పంపిణీని రాష్ట్ర చేపడుతున్న నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు. డీలర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని.. దానికి లోబడి జీవోను విడుదల చేయాలని డీలర్ల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డీలర్లను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..