రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం పెరిగింది. ప్రజలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన రంగా అనే రేషన్ డీలర్ రేషన్ పంపిణీకి వినూత్న ఆలోచన చేశాడు.
లబ్ధిదారులకు పంపిణీ చేసే సరుకులను నేరుగా వారికి అందజేయటం వల్ల ఎక్కువ ఇబ్బంది ఉందని భావించిన ఆయన వినూత్నంగా ఆలోచించాడు. బియ్యం, పిండి మిల్లులో మాదిరిగా పైనుంచి ధాన్యం, బియ్యం, పప్పులు పోస్తే పిండి కిందికి వచ్చే విధంగా.. స్టీలు తొట్టిలో సరకులు పోస్తే గొట్టం ద్వారా కిందికి వచ్చేలా తయారు చేయించారు. ఈ గొట్టం ద్వారా వినియోగదారులు... నేరుగా తమ సరుకులను సంచులలో పట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. సామాజిక దూరం పాటించడానికి వీలు కలగడంతో పాటు కరోనా వ్యాప్తి నివారణకు దోహదం చేస్తుందని ఇలా తయారు చేసినట్లు డీలర్ తెలిపాడు.
ఇదీ చదవండి: