పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి దిల్లీ, హైదరాబాద్లో ఉంటున్నారు తప్ప..నియోజకవర్గంలో కనిపించటం లేదని మండిపడ్డారు. తాము ఓట్లేసి గెలిపిస్తే..ఎంపీగా ఒక్క ఎస్సీ కాలనీని కూడా ఇప్పటివరకు సందర్శించలేదని ఆందోళన చేపట్టారు.
రఘురామకృష్ణరాజును ఎంపీగా పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలని పాలకోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీచదవండి