పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టులో మరో కీలకమైన నిర్మాణం పూర్తి కానుంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం(polavaram hydro electric project news) పనుల్లో భాగంగా ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు చేపట్టారు. ఈ నిర్మాణ ప్రక్రియలో మొత్తం 12 ప్రెజర్ టన్నెల్స్(pressure tunnels in polavaram hydro electric project )ను తవ్వాల్సి ఉంది. ఒక్కో టన్నెల్ పొడవు 150.3 మీటర్ల చొప్పున అలాగే 9 మీటర్ వెడల్పుతో తవ్వాల్సి ఉంది. ప్రాజెక్టులో ఈ పనులు కూడా చేపట్టిన మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్.. రెండో ప్రెజర్ టన్నెల్ తవ్వకం పనులు పూర్తి చేసింది. మిగతా టన్నెల్స్ తవ్వకం పనులు కూడా త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించారు.
ప్రెజర్ టన్నెల్(pressure tunnels) తవ్వకం పనుల్లో భాగంగా 21, 39, 639 క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులు పూర్తి చేశారు. దీంతోపాటు జలవిద్యుత్ కేంద్రంలో 80 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 12 వెర్టికల్ టర్బైన్లను బిగించాల్సి ఉంది. ప్రెజర్ టన్నెళ్లకు అనుసంధానిస్తూ 12 జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని మెగా ఇంజినీరింగ్ సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి