పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన నక్క నిర్మల ఏడు నెలల గర్భిణి. అమెకు అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆకివీడులోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. కరోనా పరీక్షలు చేయించుకుని వస్తేనే వైద్యం చేస్తామని వైద్యులు తెలిపారు. గత నెల 29న చేసిన కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిందని.. దానికి సంబంధించిన మెసేజ్ ని చూపించినా.. వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారని బంధువులు తెలిపారు.
కనీసం ప్రథమ చికిత్స అయినా చేసి ఉంటే బ్రతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకివీడు ప్రైవేట్ ఆస్పత్రి నిరాకరించటంతో భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలోనూ ఇదే సమాధానం ఎదురయిందని అన్నారు. భీమవరం నుంచి ఏలూరు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి వద్ద ఆమె మరణించిందని తెలిపారు. శవానికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. సరైన సమయంలో వైద్యం అంది ఉంటే ఆమె మరణించేది కాదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: