పశ్చిమ గోదావరి జిల్లా కొండూరు మండలం పోతునూరు ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1994- 95లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం తమ ఆయుస్సును పెంచుతుందన్నారు. ఉపాధ్యాయులకు.. విద్యార్థులు ప్రయోజకులు అయినప్పుడే ఆనందం కలుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులంతా కలిసి.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు.. ఉపాధ్యాయులను పూలమాలలతో సత్కరించారు.
ఇదీ చదవండి: