పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 5,956 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లాలో 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తణుకు పరిసరాల్లో 12, భీమవరంలో 5, ఏలూరులో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తణుకులో 2,914 మంది, ఏలూరులో 1,392 మంది, భీమవరంలో 1,650 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
పరీక్షలకు సంబంధించి విద్యార్థులు శానిటైజర్, మాస్కులతో పాటు.. కరోనా లక్షణాలకు సంబంధించి ఎటువంటి అనారోగ్యాలు లేవని తల్లిదండ్రుల సంతకం ఉన్న డిక్లరేషన్ సమర్పించాలని అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలు మార్చినందువల్ల ఈనెల 17వ తేదీ తర్వాత డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఉదయం 9:30 గంటల కల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని జిల్లా కో కన్వీనర్ శ్రీనివాసరావు చెప్పారు.
ఇవీ చదవండి: