పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆక్వా రైతులు, వరి రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును భీమవరంలో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాలకొల్లు నుంచి ఏలూరు వరకు రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సమస్యలపై మాట్లాదామంటే జిల్లా అధికారులు కనీసం ఫోన్లో అందుబాటులో ఉండటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలని కోరారు. పాలకొల్లు నుంచి సైకిల్‌పై ఏలూరు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు ఎమ్మెల్యే బయల్దేరారు. భీమవరం వచ్చేసరికి పోలీసులు నిమ్మల రామానాయుడు అడ్డుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెదేపా ఎమ్మెల్యే అరెస్టు... ఖండించిన రాష్ట్రాధ్యక్షుడు - Police Blocked MLA Nimmala Ramanaidu news
రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాలకొల్లు నుంచి భీమవరం చేరుకున్న ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆక్వా రైతులు, వరి రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును భీమవరంలో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాలకొల్లు నుంచి ఏలూరు వరకు రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సమస్యలపై మాట్లాదామంటే జిల్లా అధికారులు కనీసం ఫోన్లో అందుబాటులో ఉండటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలని కోరారు. పాలకొల్లు నుంచి సైకిల్‌పై ఏలూరు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు ఎమ్మెల్యే బయల్దేరారు. భీమవరం వచ్చేసరికి పోలీసులు నిమ్మల రామానాయుడు అడ్డుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: రైతుల సమస్యలపై ఎమ్మెల్యే సైకిల్ యాత్ర