Pakala Beach Tragedy : సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వచ్చిన స్నేహితులు మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఆరుగురు స్నేహితులు పాకల సముద్ర తీరానికి వచ్చారు. ముక్కనుము సందర్భంగా వీరంతా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలల తీవ్రతకు ఐదుగురు సముద్రంలోకి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న మెరైన్ పోలీసులు అప్రమత్తమే వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.
ఇందులో ఒకరిని అతి కష్టం మీద ప్రాణాలతో రక్షించగలిగారు. ముగ్గురు సముద్రంలో మునిగి మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యారు. మృతులు పోన్నలూరు మండలం శివన్న పాలెంకు చెందిన మాధవ (26), జెస్సికా (16), యామిని(19)లుగా గుర్తించారు. తన్నీర్ పవన్ అనే వ్యక్తి గల్లంతయ్యారు. అతని కోసం గాలిస్తున్నారు. నవ్య అనే మహిళను కాపాడారు. మృతదేహాలను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరి జిల్లాలో విషాదం - జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు - MBBS STUDENTS MISSING