పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్ట్ లో పనిచేసే కార్మికులు తమను స్వరాష్ట్రాలకు పంపాలంటూ ఆందోళన చేస్తున్నారు. 200 మంది వలస కార్మికులు పోలవరంలో కడెమ్మ వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 45 రోజులుగా పనులు లేక ప్రాజెక్ట్ ప్రాంతంలో మగ్గిపోతున్నామని కార్మికులు తమ గోడు చెప్పుకున్నారు.
తమను సొంత రాష్ట్రాలకు పంపకుండా ఇక్కడే ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం అందరినీ కొవ్వూరు రైల్వే స్టేషన్ కు చేర్చి అక్కడ నుంచి ప్రత్యేక రైళ్లలో పంపుతామని రెవెన్యూ, పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా.. వెంటనే తరలించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు.
ఇవీ చదవండి:
నిర్లక్ష్యమా.. యంత్రాంగ వైఫల్యమా.. వి'శోక' విపత్తుకు కారణాలేంటి..?