పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం పెరుగుతోంది. వరద నీరు ప్రాజెక్ట్ పనుల్లోకి వచ్చి చేరుతోంది. పైలెట్ ఛానల్ ద్వారా స్పిల్వేలోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో స్పిల్వే నిర్మాణంలో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాలన్నీంటిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పోలవరం క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షించారు.
ఇదీ చూడండి. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను ఊరినుంచి వెలివేసిన గ్రామస్థులు