ETV Bharat / state

POLAVARAM: 'పునరావాస కాలనీల్లో కదలని పనులు.. ఇళ్ల కోసం నిర్వాసితుల పడిగాపులు' - west godavari district news

పోలవరం ప్రాజెక్టు పునరావస కాలనీల్లో మొండిగోడలు, వసతులలేమి నిర్వాసితులను వెక్కిరిస్తున్నాయి. రెండున్నరేళ్లుగా కాలనీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందమైంది. ఓ వైపు పోలవరం ప్రాజెక్టు వరద నీరు గ్రామాల నుంచి పొమ్మని పొగపెడుతోంది. మరోవైపు కాలనీలు.. అసంపూర్తిగా, అసౌకర్యాలతో దర్శనమిస్తున్నాయి. గోదావరికి వరద వచ్చిన ప్రతిసారి గ్రామాలను ఖాళీ చేసే నిర్వాసితులు.. అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం పునరావాస కాలనీలు పూర్తిచేసి తమకు సొంతింటిని అందిస్తారని రెండేళ్లుగా.. నిర్వాసితులు ఎదురు చూస్తున్నా.. వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి.

POLAVARAM
POLAVARAM
author img

By

Published : Sep 4, 2021, 7:08 AM IST

పునరావాస కాలనీల్లో కదలని పనులు.. ఇళ్లకోసం నిర్వాసితుల పడిగాపులు

పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ నిర్మాణంతో ముంపు గ్రామాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గోదావరికి చిన్న వరద వస్తేనే అక్కడి గ్రామాలు ముంపునకు గురవుతాయి. బతుకుజీవుడా అంటూ.. ఏటా నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. ఈ ఏడాది బలవంతంగా ముంపు గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితులు సరైన నివాసాలు లేక పడుతున్న పాట్లు వర్ణణాతీతం. తాత్కాలికంగా పాకలు వేసుకొని బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ముంపు గ్రామాల ప్రజలను అధికారులు అసంపూర్తిగా ఉన్న పునరావాస కాలనీలకు తరలించారు. పునరావాస కాలనీలు పూర్తై ఉంటే.. నిర్వాసితులకు ఈ పరిస్థితి ఉండేదికాదు.

వసతులు కల్పించకుండా నిర్వాసితులపై ఒత్తిడి..

పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 25 పునరావాస కాలనీల నిర్మాణం నాలుగేళ్ల కిందట ప్రారంభమైంది. రెండున్నరేళ్లుగా కాలనీల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం మారడం వల్ల.. గుత్తేదారులు అర్ధాంతరంగా కాలనీల నిర్మాణం నిలిపేశారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టకుండా కాలయాపన చేసింది. కాలనీల్లో వేలాది ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. పూర్తైన కాలనీల్లో మౌళిక వసతులలేమి వెంటాడుతోంది. ప్రాజెక్టు 41 కాంటూరు పరిధిలో 25 ప్రధాన ముంపు గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాల నిర్వాసితులను పునరావాస కాలనీలకు బలవంతంగా పంపారు. కాలనీల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ లేని ఇళ్లలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి సౌకర్యాలు కాలనీల్లో కనిపించడం లేదు. 25 ముంపు గ్రామాలను ఖాళీ చేయమని నిర్వాసితులపై ఒత్తిడి పెంచుతున్న అధికారులు వారికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలేదని నిర్వాసితులు వాపోతున్నారు.

''పునరావాస కాలనీలో కరెంట్ లేదు. మనిషికి 5 కేజీల బియ్యం ఇచ్చారు. మంచినీటి సౌకర్యం లేదు. కాలనీలో కొంత భాగానికే కరెంట్ కనెక్టన్లు ఇచ్చారు. ఇళ్లకు డోర్లు లేకపోవడంతో పాములు వస్తున్నాయి. అధికారులెవరూ అసలు పట్టించుకోవడం లేదు. సమస్యలు కనుక్కునేందుకు సైతం అధికారులు రావడంలేదు.'' - సుమలత, నిర్వాసితురాలు, వేలేరుపాడు

''వీధి దీపాలు లేవు. చీకటి పడ్డాక బయటకు రావాలంటే భయమేస్తోంది. గతంలో మనుషులు నివసించిన ప్రాంతం కాదిది. పాములు, తేళ్ల సంచారం ఆందోళన కలిగిస్తోంది. మౌళిక సదుపాయాలపై అధికారులను అడిగినా పట్టించుకోవడంలేదు. వర్షం వస్తే నీరు ఇంటిలోకి చేరుకుని ఇబ్బంది పడుతున్నాం.'' - నరసింహ, నిర్వాసితుడు, వేలేరుపాడు

పునరావాసంపై శ్రద్ధచూపని ప్రభుత్వం..

పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. పునరావాస కాలనీలను మాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ముంపును ఎదుర్కొనే 25 గ్రామాల నిర్వాసితులకు సైతం కాలనీల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిచేయలేదు. జిల్లాలోని పోలవరం మండలంలో ఒకటి, బుట్టాయగూడెం మండలంలో మూడు, జీలుగుమిల్లి మండలంలో 15, జంగారెడ్డిగూడెంలో ఒకటి, కుక్కునూరు మండలంలో 5 పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టారు.

ప్రభుత్వ మార్పుతో అటకెక్కిన పనులు..

జిల్లాలో 25 పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం మారడంతో కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల అసలు నిర్మాణాలే ప్రారంభంకాలేదు. మరికొన్ని కాలనీల్లో పనుల పురోగతి గోడలకే పరిమితమైంది. ఇంకొన్నికాలనీల్లో ఇంటి నిర్మాణాలు పూర్తైనా.. అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం మాత్రం అక్టోబర్ నాటికి 25 కాలనీల్లో 2 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అంటోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మౌళిక వసతుల కల్పన పూర్తవుతుందని చెబుతున్నారు. గత ఏడాదే ఈ రెండువేల ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అనుకున్నమేర పనులు సాగలేదు. జీలుగుమిల్లి మండలంలో సుమారు 15 కాలనీల్లో 8 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం తడవాయిలో 8 వేల ఇళ్లతో అతిపెద్ద పునరావాస కాలనీలు నిర్మాణంలో ఉంది.

అన్నికాలనీల్లో అసంపూర్తి నిర్మాణాలు, మౌళిక వసతులలేమి నిర్వాసితులను వెక్కిరిస్తోంది. గత ఏడాది మార్చి నాటికి కనీసం 2 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి.. మౌళిక వసతులు కల్పించి ఉంటే.. తమకు ఇబ్బందులు తప్పేవని నిర్వాసిత గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీలను పూర్తిచేయాలని వారు కోరుతున్నారు.

''కరెంటు సదుపాయం కల్పించేందుకు అధికారులు వాయిదాలతో తాచ్చారం చేస్తున్నారు. చీకట్లో నిద్రపోవలసి వస్తోంది. విషపూరితమైమ కీటకాలతో ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లకు తలుపులు, కిటికీలు లేక వర్షంతో ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఇకనైనా సమస్యలపై స్పందించాలి.'' - నారాయణరావు, నిర్వాసితుడు, వేలేరుపాడు

ఇదీ చదవండి:

కలెక్టర్‌ స్పందనతో వృద్ధురాలికి ఊరట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.