పోలవరం ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం(ppa team) సందర్శించింది. అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం.. ప్రాజెక్టులోని వివిధ పనులను పరిశీలించారు. ముందుగా.. ఎగువ కాపర్ డ్యాంను సందర్శించి.. అక్కడ జరుగుతున్న పనులు తీరు గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం స్పిల్ వే నుంచి గేట్ల ద్వారా వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. స్పిల్ వే వంతెనపై గేట్ల అమరిక గురించి పోలవరం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించారు.
నాలుగు రోజుల పాటు.. పీపీఏ బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. బృందం సభ్యులు.. రేపు, ఎల్లుండి పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలను సందర్శించి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
ఇదీ చదవండి..
డ్యాంల పరిరక్షణకు 315 మంది నియామకానికి కసరత్తు: మంత్రి అనిల్ కుమార్