పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రాంబాబు(31) ఆయిల్ ఫామ్ గెలలు నరికే పనులకు వెళ్తున్నాడు. మహాదేవపురంలో ఓ రైతు పొలంలో ఆయిల్ ఫామ్ గెలలు నరుకుతుండగా గెడ కత్తి జారి విద్యుత్ వైర్లు పై పడింది. దీంతో విద్యుత్తు షాక్ కు గురై రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్సై మధు వెంకట రాజా తెలిపారు.
ఇదీ చూడండి