ETV Bharat / state

పింఛన్లు నిలిచిపోయి లబ్ధిదారుల అవస్థలు.. ఎలా బతికేదంటూ ఆవేదన..

అధికారుల అలసత్వం..! క్షేత్రస్థాయి సిబ్బంది పనితనం..! సాంకేతిక సమస్యలు..! ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు.. కొందరు పింఛన్‌ లబ్ధిదారుల పాలిట అవి శాపాల్లా మారాయి. అన్ని అర్హతలతో ఏళ్లుగా లబ్ధి పొందుతున్న వారిని.. ఒక్కసారిగా అనర్హులుగా తేల్చేశాయి. ఒక్క కుదుపుతో రోడ్డున పడ్డ ఆ బాధితులు.. పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జీవితం ఎలా వెల్లదీయాలో తెలీక.. దిక్కుతోచని స్థితిలో అవస్థలు పడుతున్నారు.

pension problems
pension problems
author img

By

Published : Nov 14, 2021, 7:43 PM IST

పింఛన్లు నిలిచిపోయి లబ్ధిదారుల అవస్థలు.. ఎలా బతికేదంటూ ఆవేదన..

ఏలూరు కలెక్టరేట్‌లో పడిగాపులు కాస్తున్న వీరంతా పశ్చిమగోదావరి జిల్లాలోని... పింఛన్‌ లబ్ధిదారులు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌పైనే ఆధారపడి బతుకీడుస్తున్నారు. ఏళ్లుగా ఆ డబ్బుతోనే.. నెలవారీ ఖర్చులు, మందులూ కొంటూ జీవితం సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా ఏవేవో కారణాల వల్ల.. వీరి పింఛన్లు నిలిచిపోయాయి. వారి జీవితం కూడా నిలిచినంత పనైంది. అన్ని అర్హతలతో.. కొన్ని ఏళ్లగా ప్రభుత్వ సాయం అందుకుంటున్న తమకు.. ఆ లబ్ధి అందకుండా చేస్తున్నదెవరో వారికి తెలియదు. ఎవరిని అడిగితే దయచూపుతారో అర్థం కాని పరిస్థితి. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం దొరకలేదు. ఎంతో దూరం ప్రయాణించి వెళ్లి.. ఏలూరు కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమంలో గోడు వెళ్లబోసుకున్నా.. స్పష్టమైన భరోసా రాకపోవడంతో.. నిస్సహాయులవుతున్నారు. పింఛన్లు పునరుద్ధరించి తమకు న్యాయం చేసే వారి కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.

''నా భర్త చనిపోయాక ఆయన పింఛన్ నాకు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నా. అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. ఇరుగు పొరుగు వారి సాయంతో జీవనం సాగిస్తున్నా. వాలంటీర్లు సైతం పింఛను వస్తుందని అంటున్నారు.. కానీ ఇప్పటి వరకూ ఏ సాయం అందలేదు.'' - మహాలక్ష్మీ, వెంకటాపురం

''చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రూ. 1000 పింఛను వచ్చేది. జగన్ వచ్చాక పెరిగిన రూ. 250తో కలిపి రూ. 1250 చొప్పున నాలుగు నెలలు ఇచ్చారు. రెండేళ్లుగా వస్తుందంటూ సమయం దాటవేస్తూ వచ్చారు. కనీసం మందులు తెచ్చుకోవడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాను.'' - ఏలూరు గ్రామీణ మండలం

''ఈ దివ్యాంగురాలి పేరు శాంతి. జంగారెడ్డిగూడేనికి చెందిన ఈమె 90 శాతం వైకల్యంతో బాధపడుతోంది. రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన ఈమెకు.. కొంత కాలంగా పింఛన్‌ నిలిచిపోయింది. 22 ఏళ్లుగా లబ్ధి పొందుతున్న తనకు.. పింఛన్‌ ఎందుకు నిలిపేశారో కూడా ఈమెకు తెలీట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో.. ఎవరిని ప్రాధేయపడాలో పాలుపోవడం లేదని వాపోయారు.'' -శాంతి, దివ్యాంగురాలు, జంగారెడ్డిగూడెం

సంక్షేమ పథకాలు అర్హులకే అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పలు నిబంధనలు తీసుకొచ్చింది. పరిమితికి మించి భూమి, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం, నాలుగు చక్రాల వాహనం ఉండటం, ఆదాయం పన్ను చెల్లిస్తున్నవారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తి... అసలైన అర్హులు పథకాలకు దూరమయ్యారు. పింఛన్‌ లబ్ధిదారుల్లో 25 శాతం మందిని తొలగించాలన్న లక్ష్యంతోనే.. ప్రభుత్వం ఇలాంటివి చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 20 వేల మందిని అర్హుల జాబితా నుంచి తీసేయగా.... వీరిలో 15 వేల మంది అసలైన అర్హులేనని తెలుస్తోంది. 15 వేల మంది అన్ని ధ్రువీకరణ పత్రాలతో.. పింఛన్లు పునరుద్ధరించాలని దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పత్రాలు అందించి ఏడాదిన్నరగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారుల నుంచి స్పందనే లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ఒకసారి తొలగించిన లబ్ధిదారులను తిరిగి జాబితాలో చేర్చేందుకు.. సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కొందరు... అన్ని అర్హతలతో పింఛన్‌ కోసం కొత్తంగా దరఖాస్తు చేసుకున్నా.... వారికీ మంజూరు కావట్లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక.. మిగతా లబ్ధిదారులూ.. ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: AP NIT: ప్రత్యేక ఆకర్షణగా ఏపీ నిట్‌.. అభివృద్ధి దిశగా పయనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.