ETV Bharat / state

KOLLERU LAKE: కొల్లేరు సరస్సు ఐకానిక్‌గా 'గూడకొంగ' - కొల్లేరు సరస్సు తాజా వార్తలు

pelican as iconic to kolleru
కొల్లేరు సరస్సు ఐకానిక్‌గా గూడకొంగ..
author img

By

Published : Oct 6, 2021, 3:49 PM IST

Updated : Oct 6, 2021, 6:16 PM IST

15:44 October 06

కొల్లేరు సరస్సు ఐకానిక్‌గా గూడకొంగను ఎంపిక చేసిన అటవీశాఖ

 కొల్లేరు సరస్సు ఐకానిక్‌గా గూడకొంగను.. అటవీశాఖ ఎంపిక చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఐకానిక్ వీక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్స్ ప్రతీప్ కుమార్ గూడకొంగ లోగో, పోస్టర్​ను ఆవిష్కరించారు. కొల్లేరు వంటి చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 

                రామ్ సర్ డిక్లరేషన్​లో భాగంగా ప్రస్తుతం అభయారణ్యంగా, చిత్తడి నేలల ప్రాంతంగా కొల్లేరు సరస్సు ఎంపికైందని.. అత్యంత అరుదైన ఈ అభయారణ్యం, చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్లాండ్ మిత్రాస్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పీసీసీఏఎఫ్ ప్రతీప్ కుమార్  తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మ్యాప్​ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం కొల్లేరు సరస్సులోని సగం ప్రాంతం అభయారణ్యంగానూ మరో సగం చిత్తడి నేలల ప్రాంతంగానూ ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత పరిరక్షణతో పాటు చిత్తడి నేలల ఆవశ్యకతను తెలియజేస్తూ సైన్ బోర్డు లను ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికంగా సేవా దృక్పధం ఉన్నవారిని గుర్తించి వెట్లాండ్ మిత్రాస్​ను నియమించినట్లు పీసీసీఎఫ్ తెలిపారు. ప్రస్తుతం కొల్లేరులో ఉన్న ఈ కొంగజాతి పక్షులు ప్రపంచ వ్యాప్తంగా నలభై శాతానికిపైగా ఇక్కడే ఉన్నాయని వివరించారు. దీంతో వెట్ ల్యాండ్ అంబాసిడర్​గా గూడకొంగను ఎంపిక చేసినట్లు పీసీసీఏఎఫ్ ప్రతీప్ కుమార్  తెలిపారు.

ఇదీ చదవండి: 

తితిదే బోర్డులో నేర చరితుల నియామక పిటిషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా

Last Updated : Oct 6, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.