ETV Bharat / state

Paddy Farmers problems in West godavari district : రైతుల వెతలు.. ధాన్యం అమ్ముకోలేక అవస్థలు

author img

By

Published : Nov 26, 2021, 8:42 PM IST

అష్టకష్టాలు పడి వరి పండించిన అన్నదాత.. ఆ ధాన్యాన్ని కూడా సజావుగా విక్రయించలేకపోతున్నాడు. తేమ లేని ధాన్యాన్నే కొనుగోలు చేస్తామనే ప్రభుత్వ నిబంధనలు వారికి ఇబ్బందిగా మారాయి. ఇటు ధాన్యాన్ని వర్షాల కారణంగా ఆరబెట్టలేక, అటు కల్లాల్లో ఉంచలేక నానా అవస్థలు పడుతున్నారు. పశ్చిమగోదావరి(special story on paddy farmers problems) రైతుల దీనగాథపై ఓ కథనం.

పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం అమ్ముకోలేక రైతుల అవస్థలు

పశ్చిమగోదావరి జిల్లాలో వరి కోతలు కోస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నడుమ అతికష్టం మీద ధాన్యాన్ని ఇంటికి చేర్చినా.. అమ్ముకోవడం వారికి తలకు మించిన భారమవుతోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. అనేక నిబంధనలతో సమస్యలు తప్పడం లేదు.

17శాతం తేమ ఉంటేనే మద్దతు ధరకు కొంటామని అధికారులు చెప్పడం రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. పంట నూర్పిడి చేసి ధాన్యాన్ని వారం రోజులపాటు ఆరబెడితేనే 17 తేమ శాతం వస్తుంది. గతంలో 17శాతానికి ఎక్కువగా ఉంటే ధరలో కోత విధించే వారు. కానీ.. ప్రస్తుతం మాత్రం ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదని, ధాన్యాన్ని కొనేది లేదని అధికారులు తేల్చి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.

వర్షాల వల్ల ధాన్యాన్ని ఆరబెట్టే పరిస్థితి లేదని, అందువల్ల తేమ శాతం నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నారు. ఈసారి జిల్లాలో ఖరీఫ్‌లో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. చాలా చోట్ల తడుస్తూనే పంటను రైతులు నూర్పిడిచేస్తున్నారు. ధాన్యాన్ని కొందరు రైతులు డ్రయ్యర్ల ద్వారా ఆరబెడుతున్నారు. వీటికీ గిరాకి అధికంగా ఉండడం వల్ల ఛార్జీలు పెంచారు. మండలానికి ఒకటి రెండు డ్రయ్యర్లు ఉన్నా.. అవి అందరికీ చాలడంలేదు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చెయ్యకపోతే ఇంకా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. వెంటనే ధాన్యం కొనేలా మిల్లర్లను ఆదేశించాలని కోరుతున్నారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.