Old woman donated 3 crores of land at west godavari district: గ్రామంలో ఆసుపత్రి నిర్మిస్తే పేదలందరికీ ఉపయోగకరమని భావించారా వృద్ధురాలు. కోట్ల విలువైన భూమి ఇచ్చి తన ఔదార్యాన్ని చాటారు. పశ్చిమగోదావరి జిల్లా వెలివెన్ను గ్రామానికి 10 పడకల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామంలో అన్నీ ఖరీదైన భూములు కావడంతో స్థలసేకరణ అధికారులకు పెద్దసమస్యగా మారింది.
Donated 7Acres of land to hospital: గ్రామానికి చెందిన దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మకు ఈ విషయం తెలిసింది. 76 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలో ఉన్న ఆమె వెంటనే స్పందించారు. తాను స్థలం ఇస్తానంటూ ముందుకొచ్చారు. తనకున్న ఏడు ఎకరాల్లో రూ.3 కోట్ల విలువైన ఒక ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేయించి గురువారం ఆ పత్రాలను స్థానిక జడ్పీటీసీ సభ్యుడు భాస్కరరామయ్య సమక్షంలో రెవెన్యూ అధికారులకు అందించారు. తమ దంపతుల పేరుతో ఆసుపత్రి నిర్మించి పేదలకు వైద్యసేవలు అందించాలని కోరారు. సీతమ్మ భర్త సుబ్బారావు నాలుగేళ్ల కిందట చనిపోయారు. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం సీతమ్మ బాగోగులను బంధువులు చూస్తున్నారు.
ఇదీ చదవండి: