పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. 1999 లో పదో తరగతి చదివిన వారంతా ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బాపూజీ మాట్లాడుతూ నైతిక విలువలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్న ఉద్యోగం పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు. స్నేహితులంతా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇవీ చదవండి:
ముప్పై ఏళ్లనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న పూర్వ విద్యార్థులు