బంగారం కోసం ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హత్య చేశారు దుండగులు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరంలో జరిగింది.
ధర్మవరానికి చెందిన కుందుల అనంత రాజ్యలక్ష్మి భర్త ఐదేళ్ల క్రితం చనిపోగా... ఆమె కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. దీంతో వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన దుండగలు హత్యకు పన్నాగం పన్నారు. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి చేతులను చీరతో కట్టి.. గొంతు నులిమి హత్య చేసి బంగారంతో ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పశ్చిమ గోదావరి సరిహద్దులో కరోనా అలజడి