పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల జాబితాను అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో 24,17,567 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో 12,20,491 మంది మహిళా ఓటర్లు ఉండగా... 11,96,928 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 148 మంది ఇతరులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం పురుషుల కంటే సుమారు 23,500 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పదవులకు పోటీ చేసేవారిలో మహిళలే అధికంగా ఉండనున్నారు. జిల్లాలో 48 జడ్పీటీసీ స్థానాలలో 25మహిళలకు కేటాయించగా ... ఎంపీపీ పదవులు 48 లో 25 మహిళలకే కేటాయించారు. జిల్లాలోని 876 ఎంపీటీసీ స్థానాలలో 451 మహిళలకే కేటాయించారు. మండలాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే చింతలపూడి మండలం అత్యధికంగా 72,116 ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. తక్కువ ఓటర్లు కలిగిన మండలంగా వేలూరుపాడు నమోదైంది. ఇక్కడ కేవలం 16,550 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
ఓటర్ల జాబితాను ఖరారు చేసిన అధికారులు - Officers who finalized the list of voters
స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓటర్ల జాబితాను అధికారులు ఖరారు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 24 17,567 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని చింతలపూడి మండలంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల జాబితాను అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో 24,17,567 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో 12,20,491 మంది మహిళా ఓటర్లు ఉండగా... 11,96,928 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 148 మంది ఇతరులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం పురుషుల కంటే సుమారు 23,500 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పదవులకు పోటీ చేసేవారిలో మహిళలే అధికంగా ఉండనున్నారు. జిల్లాలో 48 జడ్పీటీసీ స్థానాలలో 25మహిళలకు కేటాయించగా ... ఎంపీపీ పదవులు 48 లో 25 మహిళలకే కేటాయించారు. జిల్లాలోని 876 ఎంపీటీసీ స్థానాలలో 451 మహిళలకే కేటాయించారు. మండలాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే చింతలపూడి మండలం అత్యధికంగా 72,116 ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. తక్కువ ఓటర్లు కలిగిన మండలంగా వేలూరుపాడు నమోదైంది. ఇక్కడ కేవలం 16,550 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
ఇదీ చూడండి: గ్యాస్ సిలిండర్ పేలి దుకాణం దగ్ధం