ETV Bharat / state

'పోలవరం నిర్మాణాన్ని ఆపేయండి' - పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం విధానం న్యూస్

'పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేస్తూ 2018 జులై 10, 2019 జూన్‌ 27 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను రద్దుచేయండి. మాకు జరిగే నష్టనివారణకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలి.' అని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. 71 పేజీల అఫిడవిట్‌ను ఆ రాష్ట్రం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది.

odisha govt on polavaram
odisha govt on polavaram
author img

By

Published : Feb 9, 2020, 7:29 AM IST

గోదావరి వరద పోలవరం దగ్గరకు వచ్చేటప్పటికి 36 లక్షల క్యూసెక్కులు ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి ట్రైబ్యునల్‌కు చెప్పింది. కానీ, 2009లో చేసిన వెనుకజలాల అధ్యయనంలో ఆ ప్రవాహం 50 లక్షల క్యూసెక్కుల వరకు ఉండొచ్చని, దానివల్ల ఒడిశాలో 216 అడుగుల వరకు ముంపు ఉంటుందని పేర్కొంది. తర్వాత రూర్కీ ఐఐటీ చేసిన సర్వేలో గరిష్ఠ సంభావ్య వరద 58 లక్షల క్యూసెక్కులు ఉండే అవకాశం ఉందని, దానివల్ల ఒడిశాలోని శబరి, సీలేరుల్లో 218.40, 232.28 అడుగుల మేర ముంపు తలెత్తే ప్రమాదం ఉంటుందని తేలింది. అంత వరద వస్తే.. పోలవరం డ్యాం తట్టుకోలేదు. దానివల్ల పెద్ద విపత్తు తలెత్తే ప్రమాదం ఉంది.

  1. మార్చిన డిజైన్లకు అనుగుణంగా మా భూభాగంలో ముంపు ప్రాంతం పెరిగేందుకు అనుమతిస్తూ ఒడిశా ఏ ఒప్పందంపైనా సంతకం చేయలేదు.
  2. ఒడిశాలో విస్తరించే వెనుక జలాల గురించి కేంద్ర జలసంఘం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఎం.గోపాలకృష్ణన్‌ చేసిన సంయుక్త అధ్యయనంలో చాలా లోపాలున్నాయి. గరిష్ఠ వరదను లెక్కించడానికి బ్యాక్‌వాటర్‌ స్టడీ చేయించాలి.
  3. 1978లో సమర్పించిన డీపీఆర్‌లో చాలా పూడిక ఇచ్చంపల్లి వద్దే ఆగుతుందన్నారు. ఇప్పుడది లేదు కాబట్టి మొత్తం పూడిక పోలవరం డ్యాం ముందు భాగానికి చేరుతుంది. దీనివల్ల వచ్చే 30-50 ఏళ్లలో వెనుక జలాలతో నష్టం మరింత పెరుగుతుంది.
  4. కేంద్రం చెప్పిన ముంపు గ్రామాల సంఖ్య తప్పు. 2005లో బాధిత గ్రామాలు 412గా పేర్కొన్నారు. 2006లో అందులోంచి 136 తొలగించారు. 2017 మే నాటికి ముంపు గ్రామాల సంఖ్య 371కి చేరింది. మొత్తం ముంపు గ్రామాల సంఖ్యపై స్పష్టత లేదు.
  5. ముంపు తలెత్తకుండా అడ్డుకట్టలు నిర్మించేందుకు ఒడిశా అంగీకరించలేదు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తోంది.
  6. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డ్యాం డిజైన్‌ మార్చిన విషయాన్ని గుర్తించే 2011లో కేంద్రం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేయాలని ఉత్తర్వులిచ్చింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజాభిప్రాయసేకరణ చేయకుండా ప్రాజెక్టులో నీరు నిల్వ చేయబోమని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చాకే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసినట్లు కేంద్రం చెప్పింది. ఇంతవరకూ ఏపీ ప్రభుత్వం ఎగువ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. తరచూ స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను నిలుపుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తోంది.
  7. అంతర్రాష్ట్ర ఒప్పందంలో ఉన్న డ్యాం డిజైన్‌ను ఏకపక్షంగా మార్చుకొనేందుకు ఏపీ ప్రభుత్వానికి సీడబ్ల్యుసీ అనుమతివ్వడం అవాంఛనీయం.

ఇదీ చదవండి: సర్వస్వాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో 'ఈనాడు' ఆనందాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.