ETV Bharat / state

ప్రణాళికా లోపం.. వృథాగా తరలిపోతున్న నీరు - నల్లసముద్రంలో రైతుల సమస్యలు

కళ్లముందే నీరు పుష్కలంగా ఉన్నా... అన్నదాతలకు అందుతున్న ఫలితం శూన్యం. అటవీ ప్రాంతంలోని మారుమూల పల్లెలు కావటం....అధికారుల ప్రణాళికా లోపం వెరసి..విలువైన జలం దిగువకు వృథాగా తరలిపోతోంది. కావాల్సినంత నీరు అందుబాటులోనే ఉన్నా వందల అడుగులు బోర్లు వేయాల్సిన పరిస్థితులు అక్కడ షరామామూలై పోయాయి. చిత్తూరు జిల్లాలో శేషాచలం అటవీ ప్రాంతంలోని మూడు మండలాల రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.

no water to ponds near talakona with official negligence
ప్రణాళికా లోపం.. వృథాగా తరలిపోతున్న నీరు
author img

By

Published : Jul 30, 2020, 11:24 AM IST

Updated : Jul 30, 2020, 12:32 PM IST

ప్రణాళికా లోపం.. వృథాగా తరలిపోతున్న నీరు

దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు ఎన్నో జలపాతాలు, సెలయేళ్లకు ఆలవాలం చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండలు. భారీ వర్షాలకు జలపాతాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఆ విధంగా ఎత్తైన కొండల నుంచి జాలువారే నీరే అక్కడి రైతులకు ఆధారం. పర్యాటక ప్రాంతం తలకోనలోని జలపాతం నీటిపై మూడు మండలాలకు చెందిన రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యర్రావారి పాళెం,చిన్నగొట్టిగల్లు, రొంపిచర్ల మండలాల్లోని రైతులు ఈ శేషాచలం కొండల్లో నుంచి ‌ప్రవహించే నీటితోనే సాగు చేస్తుంటారు. ఈ మూడు మండలాల్లో దాదాపు 5వేల 200 హెక్టార్ల సాగు భూమి ఉన్నా.. కేవలం 2,035 హెక్టార్లలో మాత్రమే పంట వేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన నీరు పుష్కలంగా ఉన్నా.. అధికారుల ప్రణాళిక లోపం రైతుల పాలిట శాపంగా మారింది. కళ్లముందే గంగమ్మ ప్రవహిస్తున్నా.. సాగునీటి కోసం వందల అడుగుల లోతు వరకు బోర్లు తవ్వుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

తలకోన కొండల్లో నుంచి జారిపడే నీరు యర్రావారి పాలెం మండలంలో ఐదు చెరువుల్లోకి చేరుతుంది. అయ్యప్పరెడ్డి చెరువు, నల్లసముద్రం, మడిచెరువు, వలసపల్లి, సిద్ధలగండి చెరువులు జలపాతాల నుంచి వచ్చిన నీటితో నిండుతాయి. వీటి నుంచి మండలంలోని మిగిలిన చిన్న చెరువులకు సప్లై ఛానెళ్లు లేకపోవడంతో ఈ నీరంతా...గాజులేరు, కప్పలేరు, వలసపల్లి ఏరుల ద్వారా పింఛా నదిలో కలిసిపోతోంది. కళ్లముందు నీరు ఉన్నా పంటలు పండించుకునేందుకు ఉపయోగపడటం లేదని రైతులు చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా...పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంత రైతులంతా కలిసి తలకోన నీటి సాధన కమిటీ పేరుతో బృందంగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. పెద్ద చెరువులకు సప్లై ఛానెళ్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందజేయాలని కోరుతున్నారు

ఇదీ చదవండి: ఉపాధి హామీ పనులకు భారీగా తగ్గిన కూలీలు

Last Updated : Jul 30, 2020, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.