తెదేపా నియోజకవర్గ విస్త్రతస్థాయి సమావేశంలో... పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ స్పీకర్ కోడెల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఈ సమావేశం జరిగింది. విభజన సమస్యల ప్రభావం ప్రజలపై పడకుండా చంద్రబాబు ప్రభుత్వం పాలన చేసిందని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గుర్తు చేసుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం చూసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వం గాని స్పందించకపోతే.. ప్రజలకు తమ పార్టీ నేతలు అండగా ఉంటారని చెప్పారు.
ఇది కూడా చదవండి