ఉపాధి హామీ పథకం నిధులతో నాసిరకం నిర్మాణాలు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో సుమారు రూ.80 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. వీటిలో సిమెంట్ రహదారులు, సైడ్ కాలువల నిర్మాణాలున్నాయి. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం, జగన్నాధపురం తదితర గ్రామాల్లో నాసిరకంగా పనులు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం తమ్మిలేరు, గుండేరు ఇసుకను నిర్మాణం పనులకు ఉపయోగించొద్దు. కానీ అక్కడ అత్యధిక శాతం అదే ఇసుకను పనులకు ఉపయోగిస్తున్నారు. జగన్నాధపురంలో క్వారీ డస్ట్ ఉపయోగిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదీ చూడండి:
అనుమతులు లేకుండా ఇసుక తరలింపు