అర్హులైన నేత కార్మికులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది నేత కార్మికులు ఉండగా వారిలో 81 వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేయడం దారుణమన్నారు. మగ్గం వేసే వారు మాత్రమే కాక.. నూలు వడికే వారు, ఇతర పనులు చేసే వారినీ పరిగణనలోకి తీసుకుని పథకాన్ని అమలు చేయాలని కోరారు.
ఇదీచదవండి.