ETV Bharat / state

'డబ్బు సంపాదనలో లోకేశ్​ నంబర్ వన్' - పశ్చిమగోదావరిజిల్లా

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ లోకేశ్​కు బినామి అని, ఎన్ని విన్యాసాలైనా చేస్తాడని నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాగబాబు
author img

By

Published : Mar 27, 2019, 11:16 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న నాగబాబు
లోకేశ్​బాబుకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బినామి అని, ఎన్ని విన్యాసాలైనా చేస్తాడనినరసాపురం జనసేన ఎంపీఅభ్యర్థి, సినీనటుడు నాగబాబు అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా తణుకులోపి.వి. రామారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోదావరి జలాలను పైపులైనుల ద్వారా తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనికి కారణం కోస్తాప్రాంతంలోని కాలువలన్నీ కాలుష్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మట్టి మాఫియాను నిర్మూలిస్తామన్నారు. తాగునీటి కోసం నిధులు వచ్చినా వాటిని సద్వినియోగం చేయలేదని పేర్కొన్నారు. కమీషన్ల దురాచారంలో నిధులు కేటాయింపులు ఆలస్యమై పోయాయన్నారు. లోకేశ్​బాబు నోరు జారినా పెద్ద విశేషమేమీ లేదు కానీ... డబ్బు విషయంలో మాత్రం నెంబర్‌వన్‌ అని నాగబాబు వ్యాఖ్యానించారు. డబ్బు ఎలా సంపాదించాలి? కమిషన్‌లు ఎలా కొట్టాలనే విషయంలో దిట్ట అని పేర్కొన్నారు. నియోజకవర్గానికి నిధులు తెచ్చినా... స్వంతవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆరిమిల్లి రాధాకృష్ణనుద్ధేశించి అన్నారు. ఈ విషయంపై తమ ప్రభుత్వ హయాంలో విచారణ జరుపుతామని చెప్పారు.

ఇవి చూడండి...

'కన్నా డిపాజిట్ తెచ్చుకుంటే 10లక్షలు ఇస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.