పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీసుల హత్య కేసును ఛేదించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం .. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన వర్థన అనీష్ అనే వ్యక్తి అల్లరి చిల్లరగా తిరుగుతూ నేరస్థుడిగా మారాడు. ఈ క్రమంలోనే అనీష్ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురంలోని తన తన మేనమామ ఇంటికి వస్తూ ఉంటాడు.మేనత్త సుజాత కుమారితో ఏదో ఒక విషయంపై గొడవ పెట్టుకొని కొట్టి వెళ్తుండేవాడు. సుజాత చిన్న కొడుకు ప్రశాంత్ ఈ విషయంలో అనీష్‌పై విపరీతమైన కోపం పెట్టుకుని ఎలాగైనా అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఈనెల 17వ తేదీన అనీష్ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి సమయంలో ఇనుప రాడ్డుతో అనీష్ తలపై గట్టిగా కొట్టాడు. దాంతో అనీష్ అక్కడిక్కడే మృతి చెందాడు అని డీఎస్పీ దీలిప్ కుమార్ వివరించారు. దర్యాప్తు చేసిన పోలీసుల ముద్దాయి ప్రశాంత్ అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి