విధి నిర్వహణలో ఉన్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందటంతో... తోటి కార్మికులంతా కలిసి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం వద్ద ధర్నా చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీలో విధులు నిర్వహిస్తుండగా శ్రీనివాస అనే పారిశుద్ధ్య కార్మికుడు గ్యాస్ట్రిక్ నొప్పితో బాధపడుతూ దగ్గర్లో ఉన్న హోటల్ లో టిఫిన్ చేసి మందులు వేసుకున్నాడు.
కొద్ది సేపటికే శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కార్మికుని మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిపోయిందని... ఒక పాప, బాబుతో అతని భార్య ఎలా బతుకుతందని తోటి కార్మికులు నిరసన చేపట్టారు. వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని అంతా కలిసి పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఇదీ చదవండి: