ఎంపీ రఘురామకృష్ణరాజు.. తన సొంత నియోజకవర్గానికి వస్తే దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణవర్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజుకు వైకాపా ఎమ్మెల్యేలు, కార్యకర్తల వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉండి, ఆచంట, ఆకివీడు, తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రఘురామకృష్ణరాజు పశ్చిమగోదావరి జిల్లాలో తిరగాలంటే.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు..ఐదుగురు మృతి