నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ రాశారు. అన్న క్యాంటీన్ల బదులు జగనన్న క్యాంటీన్లు ప్రారంభించాలని కోరారు. ఆకలితో ఉన్నవారికి మంచి ఆహారం అందించడం ఎంతో అవసరమని హితవు పలికారు. లేఖ ద్వారా క్యాంటీన్ల విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.
' మంచి పేరుతోపాటు 'దైవదూత' అని జన బాహుళ్యంలో స్థిరపడిపోతుంది. తక్షణమే జగనన్న క్యాంటీన్ స్కీమ్ ప్రారంభించాలని సూచిస్తున్నా. పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మానవత్వం ప్రదర్శించేందుకు వేదిక అవుతుంది. వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ప్రారంభించాలి.' - రఘురామ
ఇదీ చదవండి: MP Raghurama letter to CM : రఘురామ లేఖలో ఇంకా ఏముందంటే...