MLA Suryanarayana Reddy fired at officials: అధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా అధికారులు కొత్త విధానాలను అవలంబిస్తున్నారని.. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సూర్యనారాయణరెడ్డి అన్నారు.
నూతన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలి.. రెండు రోజుల్లో పరిష్కారం చేపట్టకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తా. -సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే
ఇవీ చదవండి