పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా స్థాయి అధికారులతో ఎమ్మెల్యే ప్రసాద రాజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 25 పేదలకు ఇళ్లు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నరసాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఇళ్ల స్థలాలు, లే అవుట్స్ గురించి చర్చించారు. తమ నియోజకవర్గంలో మొత్తం 8266 ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. నరసాపురం అర్బన్ 4635, నర్సాపురం రూరల్ 2643, మొగల్తూరు 988 ఇళ్ల పట్టాలు లభ్దిదారులకు అందజేస్తామన్నారు. సొంత ఇళ్ల స్థలంలో ఇళ్లు నరసాపురం రూరల్‌లో 1320, నరసాపురం అర్బన్‌లో 7, మొగల్తూరు మండలంలో 2739 మంజూరయ్యాయన్నారు. నరసాపురం నియోజకవర్గంలో 71 లే అవుట్లు ఉండగా నరసాపురం అర్బన్‌లో 2 లే అవుట్లు, నరసాపురం రూరల్ 44, మొగల్తూరు 25 లే అవుట్లు ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి రౌతుగూడెం కాలువ వంతెన వద్ద కారు బోల్తా