రాష్ట్రంలో జగన్ నమూనా మద్యం పథకం అమల్లోకి వచ్చిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రారంభమైన వాక్ ఇన్ స్టోర్ లిక్కర్ మాల్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ' మద్యపాన నిషేధం అంటే ఇదేనా' అనే నిరసన బోర్డును వెంట తీసుకెళ్లి.. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు శాలువా కప్పి నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదం అమలు చేస్తామని పాదయాత్రలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా ఆయా దుకాణాలు, మాల్స్ పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యాన్ని కూడా నాలుగు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ.. జేబులు గుల్లచేయడంతో పాటు పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పెద్దలు దెబ్బతీస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: AYESHA MEERA CASE: ఆయేషా మీరా కేసులో పోలీసులకు ఎస్సీ కమిషన్ నోటీసులు