కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొనియాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, సిబ్బందికి ఆయన పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు త్వరలోనే ఆస్పత్రికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తణుకులోనే పరీక్షలు నిర్వహించేలా అనుమతి తీసుకొస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. వైద్యులు, సిబ్బంది మరింతగా సేవలందించాలని కోరారు.
వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - తణుకులో పీపీఈ కిట్ల పంపిణీ తాజా న్యూస్
కరోనా విపత్తు సమయంలో వైద్యులు అందిస్తున్న సేవలు అనితరసాధ్యం అని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి ఆయన పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొనియాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, సిబ్బందికి ఆయన పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు త్వరలోనే ఆస్పత్రికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తణుకులోనే పరీక్షలు నిర్వహించేలా అనుమతి తీసుకొస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. వైద్యులు, సిబ్బంది మరింతగా సేవలందించాలని కోరారు.
ఇదీ చూడండి: వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ