ETV Bharat / state

రైతు సంక్షేమానికే పెద్దపీట: మంత్రి తానేటి వనిత - కొవ్వూరు వ్యవసాయ సలహా మండలి సమావేశం

వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టాయని మంత్రి విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, రైతు సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

మంత్రి తానేటి వనిత
మంత్రి తానేటి వనిత
author img

By

Published : Oct 10, 2020, 7:15 AM IST

వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్తీ, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎంపిడివో కార్యాలయంలో..కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల వ్యవసాయ సలహా మండలి మొదటి సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

గత ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా రైతులను మభ్యపెట్టిందని మంత్రి విమర్శించారు. అన్ని సదుపాయాలు ఒకేచోట అందాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం, మొక్కజొన్న, పొగాకు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి : మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం... ఎస్సైపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.