ETV Bharat / state

'అమరావతిపైనే అంత ఖర్చు చేస్తే.. మిగతా ప్రాంతాల పరిస్థితేంటి..?' - three capitals for AP news

అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. రాజధానిని నిర్మించే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజధాని కోసమే ఇంత ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితేంటని ప్రశ్నించారు.

minister perni nani comments on amaravthi in westgodavari district

author img

By

Published : Jan 12, 2020, 8:13 PM IST

అమరావతిపై ఖర్చు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం లేదన్న మంత్రి పేర్నినాని
దేశంలో పదో ఆర్థిక నగరంగా ఉన్న విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరువేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో మౌలిక వసతులు, అభివృద్ధి పేరుతో సుమారు రెండు లక్షల కోట్ల నగదును ఖర్చు చేయాలంటే.. మన రాష్ట్రం భరించే స్థితిలో లేదన్నారు. రాజధాని కోసమే ఇంత ఖర్చు చేస్తే... మిగతా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధి పరిస్థితేంటని వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబును ఉద్దేశిస్తూ... రెచ్చగొట్టే నాయకుల మాటలు నమ్మొద్దని అన్నారు.

ఇదీ చదవండి:

'అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనుకడుగు వేస్తాం అనుకోవద్దు'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.