ETV Bharat / state

'పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను చంద్రబాబు హయాంలోనే కట్టారు' - Anilkumar Yadav comments on Polavaram

పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను చంద్రబాబు హయాంలో కట్టారని.. అది కొట్టుకుపోవడానికి చాలా కారణాలున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. లక్షలాది క్యూసెక్కుల నీరు వస్తుందని తెలిసినా ఇష్టానుసారం అసంపూర్తిగా పనులు చేయడం వల్ల, ఇవాళ 1.5 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్‌ వాల్‌ వద్ద ఇసుక కొట్టుకు రావడంతో 185 మీటర్ల మేర ఆ వాల్‌ కూలిపోయిందని మంత్రి వివరించారు.

Minister Anilkumar Yadav Press Meet Over Polavaram Dam
మంత్రి అనిల్ కుమార్ యాదవ్
author img

By

Published : Mar 10, 2021, 8:58 PM IST

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను 2018లో చంద్రబాబు హయాంలో కట్టారని, ఇవాళ అది కొట్టుకుపోవడానికి చాలా కారణాలున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ‘ప్రాజెక్టును ఒక ప్లాన్‌ ప్రకారం కాకుండా... ఇష్టానుసారం ముక్కలు ముక్కలుగా కట్టారని.. దీనివల్లే కొట్టుకుపోయిందని వివరించారు. నిజానికి స్పిల్‌ ఛానల్, స్పిల్‌ వే పూర్తి చేసి నీటిని మళ్లించిన తర్వాత కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ కట్టి ఉంటే, ఏ ఇబ్బంది ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పామని మంత్రి అనిల్​కుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్పిల్‌ ఛానల్, స్పిల్‌ వే హాఫ్, కాఫర్‌ డ్యామ్‌ హాఫ్, మళ్లీ మధ్యలో డయాఫ్రమ్‌ వాల్‌.. ఇలా ఒక్కటీ పూర్తి చేయకుండా అన్నీ అసంపూర్ణంగా చేశారని చెప్పారు. లక్షలాది క్యూసెక్కుల నీరు వస్తుందని తెలిసినా ఇష్టానుసారం అసంపూర్తిగా పనులు చేయడం వల్ల, ఇవాళ 1.5 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్‌ వాల్‌ వద్ద ఇసుక కొట్టుకు రావడంతో 185 మీటర్ల మేర ఆ వాల్‌ కూలిపోయిందని మంత్రి వివరించారు.

ఈ విషయాన్ని పీపీఏకు వివరించామని మంత్రి చెప్పారు. స్పిల్‌వే పనులు పూర్తి చేయకుండా అన్నీ సగం సగం కట్టడం వల్ల నష్టం జరుగుతుందని ఇప్పటికే ప్రాజెక్టు అథారిటీకి వివరించామన్నారు. వచ్చే మే నెల నాటికి స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేసుకుని, ఆ తర్వాత కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేసి, వరదనీటితో ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకం రాకుండా వాటిని పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు.

ఇదీ చదవండీ... 'ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.