వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. శ్రీకాకుళం, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం చెన్నై, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారు.. లాక్ డౌన్ కారణంగా పనులు నిలిచిపోయి తిరుగుముఖం పట్టారు. చేతిలో సొమ్ములు లేక కాలినడకన పశ్చిమగోదావరి జిల్లా జాతీయ రహదారి వెంబడి నడిచి వెళుతున్నారు. నడిచీ నడిచీ కాళ్ళు బొబ్బలు కట్టి ఎక్కువ దూరం నడవలేక పోతున్నామని వాపోతున్నారు. దాతలెవరూ తమను ఆదుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి సొంత గ్రామాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు.
ఇవీ చదవండి.. విశాఖలో కట్టుదిట్టంగా లాక్డౌన్