ETV Bharat / state

స్వస్థలాలకు కూలీల పయనం..అడ్డుకున్న పోలీసులు!

author img

By

Published : May 10, 2020, 7:45 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వలసకూలీల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న వలసకూలీలు సొంతరాష్ట్రాలకు వెళ్తామంటూ మండుటెండలో రోడ్డు పై బైఠాయించారు.

migrant labuores news in ap
వలస వేదన

స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కూలీలు, కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పని చేస్తున్న వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్తామంటూ మండుటెండలో రోడ్డుపై బైఠాయించారు. శనివారం ఉదయం లేబర్‌ క్యాంపుల నుంచి కాలినడకన కూలీలు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. స్వరాష్ట్రాలకు వెళ్తాం తప్ప.. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని కడెమ్మ వంతెన వద్ద బైఠాయించారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ప్రాజెక్టు వాహనాలను రప్పించి తిరిగి లేబర్‌ క్యాంపులకు కూలీలను పంపించేందుకు ఎక్కించారు. కూలీలు మాత్రం ప్రాజెక్టులోకి వెళ్లబోమంటూ వాహనాల్లోంచి దిగిపోయారు. బిహార్‌ కూలీలు వెళ్లడానికి అనుమతి వచ్చిందని, ప్రత్యేక రైలు రావాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. అదే విషయం కూలీలకు చెప్పినా వినకపోవడంతో అదనంగా పోలీసులను రప్పించామన్నారు. రైలు వచ్చేవరకు ఇక్కడే ఉంటామని సుమారు 600 మంది చెప్పడంతో మేఘా కంపెనీ వారు భోజన సదుపాయం కల్పించారు.

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు శనివారం ముమ్మర తనిఖీలు చేశారు. ఆంధ్రాలోకి రావాలంటే తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లాలనే నిబంధన మేరకు ప్రతి వాహనాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వద్ద ఆంధ్రాలోకి వచ్చే వాహనాలు బారులు తీరాయి. తాడేపల్లిగూడెం క్వారంటైన్‌ కేంద్రానికి 11 మందిని పోలీసులు తరలించారు. ఒడిశాకు చెందిన 70 మంది వలస కూలీల వాహనాలను తనిఖీ చేసి ఆంధ్రాలోకి అనుమతిచ్చారు. కూలీ పనులు ఆంధ్రాలోనే చేసుకోవాలని, రాష్ట్రం దాటి వెళ్లరాదని హెచ్చరించారు.

ఇవీ చదవండి...గమ్యం దూరం... కాలిబాటన పయనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.