ETV Bharat / state

అన్నదాత కోసం అమెరికా ఉద్యోగాన్ని వదిలేశాడు - పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు

రైతు పడుతున్న కష్టాలు ఆ యువకుడిని కదిలించాయి. అమెరికాలో రెండుచేతుల సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని... భారత్ చేరుకొన్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న పక్కా ప్రణాళికతో గ్రామాల్లో అడుగుపెట్టాడు. రైతులను సంఘటిత పరిచి ముందుండి నడిపిస్తున్నారు.

young farmer
young farmer
author img

By

Published : Mar 19, 2020, 10:38 PM IST

అన్నదాత కోసం అమెరికా ఉద్యోగాన్ని వదిలేశాడు

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన హనుమంత్​ వరప్రసాద్... యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు అమెరికాలో సివిల్ ఇంజినీర్​గా పనిచేసిన ఇతను... వ్యవసాయంలో రైతులకు చేదోడువాదోడుగా నిలవాలన్న ఉద్దేశంతో భారత్​కు వచ్చారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా అన్నదాతలకు సాగులో ఖర్చు తగ్గిస్తున్నారు.

తక్కువ ధరకే...

పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఆరు మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు వరప్రసాద్. వేయి రూపాయలు డిపాజిట్ చెల్లించి... రైతులు ఇందులో జీవితకాల భాగస్వామ్య సభ్యులుగా చేరవచ్చు. డైరెక్టర్​గా ఉండాలనుకుంటే లక్ష రూపాయలు చెల్లించాలి. ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు తెరిచారు. సభ్యులైన రైతులకు ఇక్కడ తక్కువ ధరకే సరకు అందిస్తారు. సంఘం ఆధ్వర్యంలో రైతులకు తక్కువ ధరకే వరికోత యంత్రాలను సమకూర్చారు.

మందుల పిచికారికి డ్రోన్లను తక్కువ అద్దెకు ఏర్పాటు చేస్తున్నారు. కర్షకులకు పంట సాగు నుంచి మార్పిడి వరకు నిపుణులతో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వీటితోపాటు ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి... ఈ ఏడాది రెండున్నర కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. రైతులకు వెంటనే నగదు చెల్లిస్తున్నారు. రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం పాయ్ గ్రూప్​తో ఒప్పందం చేసుకొన్నారు. అద్దె యంత్రాలు కోసం జే ఫార్మ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కోట్లాది రూపాయలు లావాదేవీలను హనుమంత్​ నిర్వహిస్తున్నారు. తన మిత్రుల సహకారంతో, రైతుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.

కేంద్రం సత్కారం

2018లో ప్రారంభమైన రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో ప్రస్తుతం 14వేల మంది భాగస్వాములుగా ఉన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల నిర్వహణకు ప్రత్యేకంగా మేనేజర్లు, ఆర్గనైజర్లను నియమించారు. ఏ కార్యక్రమం చేయాలన్నా... సభ్యులు, డైరెక్టర్లు సమావేశమై నిర్ణయం తీసుకొంటారు. హనుమంత్ వరప్రసాద్ సేవలు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం యంగ్ అచీవర్ అవార్డుతో సత్కరించింది.

ఇదీ చదవండి: ఇది నిజం... ఒకే కుటుంబంలో నలుగురు ఐపీఎస్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.