ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో కండక్టర్ సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలోని తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై జరిగింది.
తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట నుంచి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్ కొప్పుల కిషోర్ సహా నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
ఇదీ చదవండి:
పంచాయతీ ఎన్నికలపై కార్యకర్తలకు ఆరిమిల్లి రాధాకృష్ణ దిశానిర్దేశం