పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. భీమడోలు పంచాయతీ పరిధిలోని లింగంపాడుకు చెందిన నంబూరి సత్యానందం, రాణి దంపతులు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ద్విచక్రవాహనంపై భీమడోలు వచ్చి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో కనకదుర్గ ఆలయం వద్ద వాహనంపైనే రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో ఏలూరు వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనస్థలిని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి