పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలను అధికారులు సడలించారు. గత నెల మెుదటి వారం నుంచి నిన్నటి వరకు లాక్డౌన్ అమలు చేశారు. ఏలూరులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమలు చేయగా..భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు ప్రాంతాల్లో జూన్ మెుదటి వారం నుంచే లాక్డౌన్ విధించారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగితా ప్రాంతాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్డౌన్ నిబంధనలు సడలించారు. పాజిటివ్ కేసులు పెరిగితే ఆంక్షలు కొనసాగించే ఆవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు సడలింపు - corona latest updates west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ను అన్ని ప్రాంతాలలో సడలించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మినహయింపు ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలను అధికారులు సడలించారు. గత నెల మెుదటి వారం నుంచి నిన్నటి వరకు లాక్డౌన్ అమలు చేశారు. ఏలూరులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమలు చేయగా..భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు ప్రాంతాల్లో జూన్ మెుదటి వారం నుంచే లాక్డౌన్ విధించారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగితా ప్రాంతాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్డౌన్ నిబంధనలు సడలించారు. పాజిటివ్ కేసులు పెరిగితే ఆంక్షలు కొనసాగించే ఆవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: విషాదం మిగిల్చిన స్నేహితుల దినోత్సవం