పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం వద్ద పోలవరం కుడి కాలువ గట్టు మట్టి అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రతి రోజు రాత్రి.. భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు.. తెలుసుకున్న గ్రామస్తులు రాత్రికి కాపుకాసి తవ్వకాలు నిలుపుదల చేశారు. అనంతరం పోలీసులకు నిలుపుదల చేశారు. 2 పొక్లెయిన్లు, 2 టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నందున.. అధికారులు నోరు మెదపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: Polavaram project: 'వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి చేస్తాం'