తెలంగాలోని అశ్వరావుపేట నుంచి రాజమహేంద్రవరానికి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. జీలుగుమిల్లి మండలం నెరుసుగూడెం మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మద్యాన్ని గుర్తించినట్లు ఎస్ఐ విశ్వనాథ్ బాబు తెలిపారు. దమ్మపేటకు చెందిన కోటగిరి ప్రవీణ్, మేడూరి సత్యనారాయణ మద్యం తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.18,450 విలువైన 25 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వివరించారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లా అనంతసాగరం మండలం చిలకల మర్రి గ్రామం లో అక్రమంగా తరలిస్తున్న 15 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రవీంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆత్మకూరు సెబ్ సీఐ నయనతార తెలిపారు.
పేకాట స్థావరాలపై దాడులు...
గుంటూరు అర్బన్ పరిధిలో గుట్కా పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. తాడేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో కుంచనపల్లిలో గుట్కా ప్యాకెట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకొని అతని వద్ద నుంచి 250 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని పలకలూరు రోడ్డులో ఉన్న మోక్షఅపార్ట్మెంట్పై దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.69,750 నగదు, 7 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: