నీటిమట్టం మరో అరమీటరు పెరిగితే ! పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పొంగి పొర్లుతోంది. జలవనరుల శాఖ అధికారులు ఎగువ కాపర్ డ్యాం వద్ద నుంచి వరద నీటిని స్పిల్ వే వైపు మళ్లించారు. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్ వే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది. వరద స్పిల్ వే గేట్ల క్లస్టర్ లెవెల్ ఎత్తు 25.72 మీటర్లు దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం స్పిల్వే గేట్లపై నుంచి దిగువకు ప్రవహిస్తోంది. పైడిపాక పైలెట్ ఛానల్, గ్రావిటీ వల్ల రెండు వైపుల నుంచి వరద పోటెత్తుతోంది.
ఇవీ చదవండి..వరద నీటితో పోలవరం ఉప్పొంగుతోంది!