మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకున్నారని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. మూడేళ్లపాటు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల.. సదావర్తి సత్రానికి చెందిన భూములను అమ్మి.. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తుంటే పైడికొండల ఒక కుహనా హిందుత్వవాదిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి
అటవీ భూములను ఆక్రమించుకున్న గిరిజనులు... తరిమికొట్టిన పోలీసులు