పశ్చిమగోదావరి జిల్లాలో శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాలు, తేనె, సుగంధ ద్రవ్యాలతో బోళాశంకరుడికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధన చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం తెల్లవారుజాము నుంచి భక్తులతో నిండిపోయింది. కోనేరులో దీపాలు వదిలి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు.
కార్తికమాసం మూడో సోమవారం పురస్కరించుకుని కడపలోని శివాలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివాలయాలు శివనామస్మరణతో మారుమోగిపోయాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తిక సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గన్నవరం నియోజకవర్గంలో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. వేకువజాము నుంచే భక్తులు పరమశివుడిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. పోతవరంలోని పార్వతి మేనకేశ్వర స్వామి ఆలయంలో 11 ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఇవీ చదవండి..